Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఎమ్ఎమ్టీఎస్లో ప్రయాణం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎమ్ఎమ్టీఎస్ రైళ్ల సేవల్ని మరింత విస్తృత పర్చాలని పలువురు ప్రయాణీకులు కోరారు. తక్కువ ఖర్చుతో భద్రతతో కూడిన ప్రయాణం లభిస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు. బుధవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మేడ్చల్ వెళ్లే ఎమ్ఎమ్టీఎస్ రైలులో ప్రయాణం చేశారు. ప్రయాణీకులతో మాట్లాడారు. మహిళలు, విద్యార్థులు, కూలీలు, నిరుద్యోగులు, ఉద్యోగులతో ఆయన సంభాషించారు.
ఎమ్ఎమ్టీఎస్ సర్వీసుల సేవల గురించి ప్రయాణీకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ సేవల్ని మరింత పెంచాలని ప్రయాణీకులు కోరారు. రైల్వే స్టేషన్ల లోని సౌకర్యాలపైనా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మల్కాజ్గిరి, దయానంద్‌నగర్, సఫిల్‌గూడ, రామకృష్ణాపురం, ఆమ్ముగూడ, కావల్రీ బ్యారక్స్, అల్వాల్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, గౌడవల్లి, మేడ్చల్ స్టేషన్లలో సౌకర్యాలను పరిశీలించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. జీఎమ్ వెంట హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్చంద్రయాన్ కూడా ఉన్నారు.