Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి
- ప్రారంభమైన విద్యార్థి నిరుద్యోగ భరోసా బస్సు యాత్ర
నవతెలంగాణ-ఓయూ
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తుందని, కొలువుల కోసం మళ్లీ కొట్లాడే సమయం వచ్చిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి అన్నారు. విద్యార్థి నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తాను నిలబడి పోరాడుతానన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ మిడతనపల్లి విజరు ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర యూనివర్సిటీల విద్యార్థి నిరుద్యోగ భరోసా బస్సు యాత్రను బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద పిడమర్తి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల విద్యార్థులు ఆత్మస్తైర్యం కోల్పోయారన్నారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దని చదువుతూ కొట్లాడాలని సూచించారు.
నిరుద్యోగుల బాధలు ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. నిరుద్యోగులు కూర్చుంటే న్యాయం జరగదని, కొలువుల కోసం కొట్లాడాలని సూచించారు. మిడతనపల్లి విజరు మాట్లాడు తూ.. పేపర్ లీకేజీకి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి టీఎస్పీఎస్సీని రద్దు చేయలని డిమాండ్ చేశారు. ఈ భరోసా యాత్ర తరువాత విద్యార్థి నిరుద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రికి వినిపించేలా అన్ని విద్యార్థి, ప్రజా సంఘాలను కలుపుకొని బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర బీసీ సంఘం నాయకులు తుర్క నర్సింహా, చొప్పరి శంకర్ పిట్ల రమేష్ యాత్రకు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్, ఆంజనేయులు ముదిరాజ్, వెంకట్ యాదవ్, వీర రాజు, మోహన్ నాయక్, వినోద్, రమేష్, జనార్దన్ ముదిరాజ్, అశోక్, రవి, సురేష్, రాజేందర్, నవీన్, రామకృష్ణ, సురేందర్, రవీందర్, అజరు పాల్గొన్నారు.