Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆటో అండ్ మోటార్ క్యాబ్ డ్రైవర్స్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు
- ఆర్టీఏ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆటో స్క్రాప్ స్కాంలో అవినీతికి పాల్పడిన అధికారులను విధుల నుంచి తొలగించాలని సిటీ ఆటో అండ్ మోటార్ క్యాబ్ డ్రైవర్స్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ర్యాలీగా రవాణా శాఖ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లు నిరసనకు దిగారు. రవాణాశాఖలో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చే వేతనాలతో పనిచేస్తున్న అధికారులు రూ.100 కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దాంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడటంతో వేలాదిమంది డ్రైవర్ల జీవితాలు ఆగం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ధర్నా చేస్తున్న పలువురు డ్రైవర్లను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో అక్తర్ అహ్మద్, హాసం మక్కే తదితరులు పాల్గొన్నారు.