Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూజర్ల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు
నవతెలగాణ - ములుగు
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన సామక్క సారలమ్మ మేడారం జాతర - 2024 తేదీలను ఆలయ పూజరులు ప్రకటించారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి పరిధి మేడారంలోనిసమ్మక్క-సారలమ్మ గద్దెల సమీపంలో పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తేదీలను ఖరారు చేసి ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 14వ తేదీన (బుధవారం) మండమేలగడం మొదలవుతుందని తెలిపారు. 21న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారని, 22.02.2024(గురువారం)న సమ్మక్కను గద్దె వద్దకు తీసుకొస్తారని, 23.02.2024(శుక్రవారం)న భక్తులు మొక్కులు తీర్చుకుంటారని వెల్లడించారు. 24.02.2024(శనివారం)న దేవతల వనప్రవేశం, 28.02.2024(బుధవారం) తిరుగువారం జాతర, పూజలతో జాతర ముగుస్తుందని తెలిపారు.