Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకతాయికి టీఎస్ఆర్టీసీ ఎమ్డీ సజ్జనార్ హితవు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నడిరోడ్డుపై కారు, ఆటో, స్కూటర్ వంటి వాహనాలు ఆగిపోతే వాటిని వెనుక నుంచి మరో వాహనం సాయంతో కాలుతో నెట్టుకుంటూ వెళ్తుంటారు. అయితే తానో బాహుబలిని అనిపించుకోవడం కోసం ఓ యువకుడు మిధానీ డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ బస్సు (104-ఎ రూట్) వేగంగా వెళ్తుంటే, దాని వెనుకనుంచి ఒక కాలుతో బస్సును తోస్తున్నట్టు వీడియో షూట్ చేయించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దంటూ హితవు చెప్పారు. 'వెర్రి వేయి విధాలు అంటే ఇదే! సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి' అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కూడా ట్రెండింగ్‌గా మారింది.