Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నత విద్యామండలి వద్ద టీఆక్టా జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 11 సర్కారు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు టీచర్ల సంఘం (టీఆక్టా) జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఆ సంఘం ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మెన్ డాక్టర్ ఎం రామేశ్వరరావు, కన్వీనర్ డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 11 విశ్వవిద్యాలయాల్లో 1,335 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారని చెప్పారు. వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 16 ప్రకారం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అదే పద్ధతిలో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులందర్నీ రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆక్టా నాయకులు జి వెంకటేశ్వర్లు, రాజేష్ ఖన్నా, సతీష్ కుమార్, జయశ్రీ, వి. హర్షిత, శ్రీనివాస్, పల్లా రేష్మారెడ్డి, సోమేశ్, సుదర్శన్, శరత్, కర్ణాకర్, సంయుక్త, పద్మ, ఆదిత్య మూర్తి, పద్మశ్రీ, శిరీష, కళ్యాణి, మను, రాధిక, జితేందర్, హరీష్, ఉదయ శంకర్, వంశీ శంకర్, మసూద్, వెంకటేష్, ఉదరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.