Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైబిజ్ టీవీ మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో హౌంమంత్రి మహమూద్ అలీ
- బెస్ట్ బిజినెస్ రిపోర్టర్‌గా చిట్యాల మధుకర్‌కు అవార్డు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జర్నలిస్టులు సమాజ చైతన్యాన్ని కాంక్షిస్తారనీ, వారి సేవల్ని రాష్ట్రప్రభుత్వం గుర్తించిందని హౌంమంత్రి మహమూద్ అలీ అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రత్యేక నిధుల్ని విడుదల చేసి, కష్టకాలంలో అండగా నిలుస్తున్నారని చెప్పారు. బుధవారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే సందర్భంగా హైబిజ్ టీవి మీడియా అవార్డ్స్- 2023 కార్యక్రమం జరిగింది. దీనికాయన ముఖ్య అతిథిగా హాజరై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో విశేష సేవలు అందించిన జర్నలిస్టులకు అవార్డులు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 42 కోట్ల నిధులను కేటాయించారని తెలిపారు. అనారోగ్య కారణాలతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారని వివరించారు. అనేక అవరోధాలు ఎదురవుతున్నా జర్నలిస్టులు వెనకడుగు వేయకుండా కష్టించి పనిచేస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా ప్రింట్ జర్నలిజం తెలుగు విభాగంలో బెస్ట్ బిజినెస్ రిపోర్టర్‌గా చిట్యాల మధుకర్‌కు అవార్డును అందచేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో రాణిస్తున్న అనిల్ కుమార్, దాస్ కేశవరావు, ఈమని కృష్ణారావులకు లెజెండ్ అవార్డులను అందచేశారు. కార్యక్రమంలో పాల్గొన్న చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో జర్నలిస్టులు వార్తాసేకరణ కోసం పోటీ పడుతున్నారని అన్నారు. ఒకప్పటి జర్నలిజంకు ఇప్పటి జర్నలిజంకు చాలా వ్యత్యాసం ఉన్నదని విశ్లేషించారు. హైబిజ్ టీవీ మీడియా అవార్డ్సులో పలు కేటగిరీల్లో 65 మందికి అవార్డులను అందజేశారు. బెస్ట్ ప్రింట్ జర్నలిస్టుగా గుండాల కష్ణ, బెస్ట్ కార్టునిస్ట్గా మత్యుంజరు, బెస్ట్ ఫోటోగ్రాఫర్‌గా గోపి బందిగే, బెస్ట్ ప్రింట్ అడ్వర్టెయిజ్మెంట్లో రాజిరెడ్డి, సీనియర్ ఎంప్లాయి రాములు తదితరులకు అవార్డులు అందచేశారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, లైఫ్ స్పాన్ సంస్థ ఎమ్‌డి నరేంద్రరామ్ నంబుల, పౌల్ట్రీ ఇండియా అధ్యక్షులు పి చక్రధర్‌రావు, భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎమ్ రవీందర్ రెడ్డి, క్రెడారు జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి, హైబిజ్ టీవీ సీఈఓ జే సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.