Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ
- అపురూపం ఆదివాసీల ఆటాపాట
- సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించిన పద్మశ్రీ సకిని రామచంద్రయ్య
- రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన ఆదివాసీ కళాకారులు
నవతెలంగాణ-భద్రాచలం
డప్పు దరువు దద్దరిల్లింది..! ఘల్లు ఘల్లు మంటూ గజ్జలు సవ్వడి చేశాయి..! డోలు, సన్నాయి మేళాలు హోరెత్తాయి..! అడుగడుగు కలుపుతూ లయబద్ధంగా నాట్యం సాగింది..! సంప్రదాయ సంస్కృతి సాక్షాత్కారమైంది..! రంగు రంగుల వస్త్రాలు కండ్లను జిగేల్ మనిపించాయి..! అపురూప వేషధారణలు మనస్సును హత్తుకున్నాయి..! ఇలాంటి ఎన్నో ఆదివాసీల ఆటపాటలు.. ఔరా అనిపించేలా ఆదివాసీ సాంస్కృతిక జాతర 'రేలా పండుం' అబాల గోపాలన్ని మరిపించింది. ఈ నెల 5,6 తేదీల్లో జరుగుతున్న తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర 3వ మహాసభలను పురస్కరించుకొని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ, రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజనుల కళాకారుల ప్రదర్శనలు భద్రాద్రి నడి బొడ్డునున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో బుధవారం సాయంత్రం అంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వీటిని ప్రముఖ ఆదివాసీ డోలు వాయిద్య కళాకారులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక కళలు సంస్కృతికి పునాద ని, ఆదివాసీ సంస్కృతి కళలేనని తెలిపారు. ఆదివాసీ సంస్కృతి జీవన విధానం, కళలు, పాటలు అత్యంత పురాతనమైనవని, మనిషి జీవనం ప్రారంభమైన నాటివన్నారు. మానవ సమాజంలోని అత్యంత పురాతనమైన ప్రకృతి తోటి, శ్రమతోటి మమేకమైన ఆదివాసీ కళలు, సంస్కృతిని, సాహిత్య వారసత్వాన్ని నేటి సమాజం ఆద రించి అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అంతరిం చి పోతున్న ఆదివాసీ కళలను, నృత్యాలను వాయిద్యా పరికరాలను సమా జంలో సజీవంగా ఉంచటం కోసం, భావితరాలకు వాటిని పరిచయం చేయ టం కోసం ఇటువంటి ఉత్సవాలు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ మాట్లాడుతూ.. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆదివాసీ సంస్కృతి, కళలు, పాటలు, వాయిద్య పరికరాలకు సరైన గుర్తింపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ ఆధునిక సాహిత్యం మరోవైపు మతోన్మాద ఆధిపత్య భావ జాలం ఆదివాసీ సంస్కృతిని ఆదివాసీ కళలను మింగేస్తున్నాయన్నారు. ఆదివాసీ హక్కుల పైన దాడి జరుగుతున్న విధంగానే వారి సాంస్కృతిక సంపదపై, కళల పై.. ఆధిపత్య భావజాలం దాడి చేస్తుందని అన్నారు. రాష్ట్రంతో పాటు భారత దేశంలోని అనేక ఆదివాసీ తెగల భాషలకు లిపిలేని కారణంగా ఆదివాసీల జీవన సంస్కృతి, వారి సాహిత్య నృత్యాలు, పాటలు భావితరాలకి అందుబాటులోకి రాలేకపోతున్నాయని తెలిపారు. వాటిని రక్షించేందుకు ఆదివాసీ భాషలకు లిపిని కనిపెట్టి వారి సాంస్కృతిక జీవనాన్ని తద్వారా ఆర్థిక, రాజకీయ జీవితాలను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని చెప్పారు. దాని కోసం టీఏజేఎస్ పోరాడు తుందని తెలిపారు. భూమిపై హక్కులు, గిరిజన యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు, గిరిజన గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రజల సంక్షేమం, గిరిజన చట్టా ల అమలు, ప్రభుత్వ విధానాల వల్ల గిరిజనులకు ఎదురవుతున్న కష్టాలు, ఇబ్బం దులపై భద్రాచలంలో జరిగే సంఘం రాష్ట్ర మహాసభలో చర్చించి నిర్ణయాలు చేస్తామని, వాటి ద్వారా పోరాటాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ నేస్రం రాజు అధ్యక్షత వహించగా రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు పాయం రవి వర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కారం పుల్లయ్య, టీఏజీఎస్ జిల్లా అధ్యక్షులు వజ్జ సురేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు సున్నం గంగ, ఆహ్వాన సంఘం నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.