Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తనిఖీలు చేపట్టిన మాదాపూర్ పోలీసులు
నవతెలంగాణ-మియాపూర్
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్‌లో బాంబు అంటూ ఫోన్ కాల్ రావడం కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదా పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీసీఎస్ స్టాప్ వేర్ కంపెనీలో బాంబు పెట్టానంటూ.. ఓ వ్యక్తి పోలీసులకు కాల్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దాంతో టీసీఎస్ కంపెనీలో పని చేస్తు న్న ఉద్యోగులను బయటకు పంపించి.. బాంబ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ ఎలాంటి బాంబు లేక పోవడం తో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ కాల్.. గతంలో సంస్థలో సెక్యూరిటీ విభాగంలో పని చేసిన ఓ ఉద్యోగి చేసినట్టుగా గుర్తించిన మాదా పూర్ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.