Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కృష్ణాబోర్డుకు సర్కారు లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
భవిష్యత్తులో ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసేసమయంలో బేసిన్‌లోని ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని కృష్ణా ట్రిబ్యునల్-1 (బచావత్ ట్రిబ్యునల్) అవార్డులో పేర్కొన్నా ఏపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాబోర్డుకు లేఖ రాసింది. ఈమేరకు రాష్ట్ర సాగునీటి పారుదల, ఆయకట్టు శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ మూడు పేజీల లేఖను ఇటీవల కృష్ణాబోర్డు చైర్మెన్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. తదనుగుణంగానే, బచావత్ ట్రిబ్యునల్ సెప్టెంబర్ 1960 తరువాత చేపట్టిన ప్రాజెక్టులకు కేటాయింపులు చేసినప్పుడు, కేవలం కృష్ణా నది బేసిన్ లోపలి ప్రాజెక్టులకు మాత్రమే నీటి కేటాయింపులు చేసిందని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంత్రప్రదేశ్ ప్రభుత్వం, బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా, వెలిగొండ ప్రాజెక్టు లాంటి కృష్ణా బేసిన్ ఆవలి ప్రాజెక్టులను, మిగులు జలాలను కేటా యించిందని లేఖలో సవివరంగా తెలియ జేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల, బేసిన్ లోని కరువు ప్రాంతా లకు నీరందించే తెలంగాణ ప్రాజెక్టులు (ఇప్పటికే నిర్మించినవి, నిర్మాణంలో ఉన్నవి) నష్ట పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున బేసిన్ ఆవలకు నీటిని మళ్లించే వెలిగొండ ప్రాజెక్టును వెంటనే నిలువరించాలని కృష్ణా బోర్డుని తెలంగాణ కోరింది.