Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ దరఖాస్తు గడువును ఈనెల ఆరో తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్ పి వరలక్ష్మి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం లేకుండా ఆన్లైన్లో ఈనెల ఆరో తేదీ వరకు దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశముందని తెలిపారు. ఆలస్య రుసుం రూ.250తో ఈనెల 12 వరకు, రూ.500తో 18 వరకు దరఖాస్తుల సమర్పణకు గడువుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తుల సవరణకు అవకాశముందని వివరించారు. ఈనెల 26,27 తేదీల్లో రాతపరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో 16, ఏపీలో నాలుగు కలిపి 20 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 75 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు https://icet.tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.