Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలదశ్యం నుంచి ఢిల్లీలో అద్వితీయ దశ్యం వరకు: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది గోల్మాల్ గుజరాత్ మోడల్ కాదు..గోల్డెన్ తెలంగాణ మోడల్. జలదశ్యంలో ఒక్కరితో మొదలైన ప్రయాణం.. మహాప్రస్థానమై దేశ రాజధాని ఢిల్లీలో అద్వితీయ దృశ్యంగా అవతరించింది' అని బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులందరికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ హదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో కేటీఆర్ మాట్లాడుతూ 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదాన్ని నిజం చేసే వరకు విశ్రమించకుండా పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కేవలం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకే కాదని యావత్తూ తెలంగాణ ప్రజలకి గర్వకారణం అన్నారు. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కార్యశ్రేణుల పట్టుదల వల్లనే తెలంగాణ ఆత్మగౌరవ పతాకైన బీఆర్ఎస్ జెండా ఇవాళ సమున్నతంగా ఢిల్లీలో రెపరెపలాడిందని గుర్తుచేశారు. ఉద్యమ నాయకుడే.. ఉత్తమ పాలకుడని యావత్ దేశం కొనియాడుతున్న వేళ పార్టీ జాతీయ ప్రస్థానం నేడు ఒక చారిత్రక అవసరమని వెల్లడించారు. నాడు ఉద్యమ పార్టీగా పురుడుపోసుకుని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన గులాబీ జెండా ఇప్పుడు దశాబ్దాలపాటు దగాపడ్డ దేశ ప్రజలను గెలిపించడానికే హస్తినలో అడుగుపెట్టిందని అన్నారు. ఉద్యమపాఠాల నుంచి మొదలుకుని యావత్ దేశానికి ఉజ్వలమైన పరిపాలనా పాఠాలు నేర్పిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని వివరించారు. ఈ మహాప్రస్థానంలో బీఆర్ఎస్ వేసిన ప్రతి అడుగు సంచలనమని, అధికార పార్టీగా తీసుకున్న ప్రతి నిర్ణయం ఓ సువర్ణ అధ్యాయమని కేటిఆర్ గుర్తుచేశారు. గోల్ మాల్ గుజరాత్ మోడల్ పనికిరాదని దేశప్రజలు గ్రహించిన నేపథ్యంలో గోల్డెన్ తెలంగాణ మోడల్‌పైనే ప్రస్తుతం చర్చ జరుగుతన్నదని చెప్పారు. జాతీయ రాజకీయ యవనికపై బీఆర్ఎస్ బలమైన ముద్ర వేయడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ను అజేయశక్తిగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క గులాబీ సైనికుడి బాధ్యత ఇప్పుడు మరింత పెరిగిందని, రానున్న రోజుల్లో మరింత సమరోత్సాహంతో కదంతొక్కాలని పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ సాధన కోసం ఏ సంకల్పంతో బయలుదేరామో, అదే స్ఫూర్తితో దేశం కోసం కదంతొక్కాలని అన్నారు.