Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర గీత కార్మిక సహకార, ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మెన్‌గా సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్‌గౌడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. రవికుమార్ నల్గొండ జిల్లాలోని చండూరు మండలం బొడంగిపర్తి గ్రామానికి చెందినవారు. ఆయన జర్నలిస్టుగా వివిధ దినపత్రికలలో సుదీర్గ కాలం పని చేశారు. ప్రస్తుతం 'తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్' వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 'పీపుల్స్ ఫౌండేషన్' పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులందరిని ఏకం చేసి పోరుబాట పట్టించారు. తెలంగాణ ఉద్యమంలో మైలురాయిగా నిలిచిపోయిన మిలియన్ మార్చ్, సాగర హారం, సకల జనుల సమ్మెలో జర్నలిస్టు నేతగా ముందు నిలిచారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను గుర్తించి కార్పొరేషన్ పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రవికుమార్‌గౌడ్ కతజ్ఞతలు తెలిపారు.