Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు టీఏజిఎస్ 3వ రాష్ట్ర మహాసభ
- బ్రహిరంగ సభకు హాజరుకానున్న బృందాకరత్, తమ్మినేని
నవతెలంగాణ-భద్రాచలం
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర 3వ మహాసభల సందర్భంగా భద్రాచలంలో నిర్వహిస్తున్న 'రేలా పండుం' ఆదివాసీ సాంస్కృతిక ఉత్సవాలు రెండవ రోజైన గురువారం మరింత రెట్టింపు ఉత్సాహంతో జరిగాయి. వివిధ ఆదివాసీ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భద్రాచలం వచ్చిన ఆదివాసీ కళాకారుల బృందాలు తమ ప్రదర్శనలతో అటా, పాటలతో స్థానికులను ఔరా అనిపించారు. నృత్యాలు, డప్పు దరువు, వేషధారణతో ఆదివాసీ కళాకారులు ప్రదర్శిస్తూ ఉండటం స్థానికులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు మాట్లాడారు. ఆదివాసీ కళలు అపురూపమని, వారి సంస్కృతి సంప్రదా యాలు చాలా గొప్పవన్నారు. భద్రాచలం వేదికగా సంఘం రాష్ట్ర మహా సభలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. గిరిజన సమస్యల పరిష్కా రానికి ఈ మహాసభల్లో కార్యచరణ చేసి అందుకు తగ్గ పోరాటాలు నిర్వహి స్తామని వెల్లడించారు. కార్యక్రమంలో టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీమ్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్, నాయ కులు మిసరం రాజు, పాయం రవి వర్మ, సున్నం గంగా పాల్గొన్నారు.
నేడే బహిరంగసభ
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర 3వ మహాసభలు భద్రాచలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 5, 6 తేదీల్లో జరగనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు ఈ మహాసభకు హాజరుకానున్నారు. బహిరంగ సభ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి భద్రాచలం పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం జూనియర్ కళాశాల గ్రౌండ్లో సాయంత్రం 5గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఈ మహాసభకు ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు, మాజీ ఎంపీ బృందా కారత్, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీంరావు, రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాబురావు, ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, తదితరులు హాజరుకానున్నారు.