Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే వనవాసి పదప్రయోగం
- ప్రమాదంలో ఆదివాసీ సంస్కృతి, భృతి
- గ్రామసభల స్థానంలో అదానీ సభలు
- మన్‌కీ బాత్ కాదు.. ఆదివాసుల బాధలు తెలుసుకోండి :
ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ నాయకురాలు బృందాకరత్
- పోడుపై పోరాటం కొనసాగుతుంది : మాజీ ఎంపీ తమ్మినేని
- టీఏజీఎస్ బహిరంగ సభ విజయవంతం
ఆదివాసీ పదం అంటేనే మోడీకి భయమనీ, అందుకే వనవాసీ పద ప్రయోగం చేస్తున్నారని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకరత్ అన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం లాగానే మోడీ ప్రభుత్వం కూడా అటవీ సంపదను కాజేస్తుందన్నారు. ఆదివాసీ హక్కులపై దాడి జరుగుతోందని చెప్పారు. ఆనాడు బ్రిటీష్ వారిపై పోరాడిన ఆదివాసీలు నేడు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర మహాసభల సందర్భంగా ''భూమిపై హక్కు, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమం, ఆదివాసీ హక్కుల రక్షణకై పోరాడుదాం'' అనే నినాదంతో భద్రాచలం జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
దేశవ్యాప్తంగా 750 తెగలు ఉన్నా, ఆదివాసీ అనే పదం రాజ్యాంగంలో లేదన్నారు. కానీ ఆ పదం భారతదేశ చరిత్ర, సంస్కృతికి నిదర్శనమని బృందా కరత్ చెప్పారు. బీజేపీని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ ఇప్పుడు అదే పదాన్ని వనవాసి పేరుతో ప్రస్తావిస్తున్నదని వివరణ ఇచ్చారు. మోడీ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం స్థానంలో అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చి, అటవీ సంపదను కొల్లగొడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ సంరక్షణ చట్టంలో గ్రామసభకు ప్రాధాన్యం లేకుండా చేసి, ఆ స్థానంలో అదానీ సభలు నిర్వహిస్తూ, అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరిస్తూ ఎస్సీ, ఎస్టీల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నారనీ, రైల్వేలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నా భర్తీ చేయట్లేదని తెలిపారు. ప్రధాని మోడీ 'మన్ కీ బాత్'తో ఒరిగిందేం లేదనీ, ఆ స్థానంలో ఆదివాసీల మనసులో మాటలను వినాలని బృందాకరత్ కోరారు. ఆర్థిక, సాంస్కృతిక రంగంలో ఆదివాసీ హక్కులను హరిస్తున్నాయన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఖనిజ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ఆదివాసీలు పోరాడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. క్రిస్టియన్ మతం పుచ్చుకున్న ఆదివాసీలను ఆదివాసీ జాబితా నుంచి తొలగించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ గుర్తింపును రూపుమాపేందుకు మనువాదాన్ని ముందు కు తెస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలన్నారు. పోడు భూములపై దాడులు ఆపాలని, గిరిజన విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించాలని కోరారు. టీఏజీఎస్ మహాసభ ద్వారా డిమాండ్ల సాధనకు పోరాటాలు చేయాలని బృందాకరత్ పిలుపునిచ్చారు.
పోడుపై పోరే..
- మాజీ ఎంపీ తమ్మినేని
బీజేపీ వ్యతిరేక పోరాటంలో బీఆర్ఎస్ను సమర్థిస్తామే కానీ పోడు పట్టాల పంపిణీ విషయంలో వెనక్కి తగ్గేది లేదని మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. పోడుపై పోరు కొనసాగుతుందని చెప్పారు. 11 లక్షల ఎకరాలకు పట్టాలిస్తామన్న సీఎం కేసీఆర్ మూడు నాలుగు లక్షలకే దాన్ని పరి మితం చేయడం సరికాదన్నారు. శాటిలైట్ సర్వే ఆధారంగా నిర్ధారణ సరి కాదన్నారు. భూమి ఎంత ఉంటే అంత పట్టా ఇవ్వాల్సిం దేనని చట్టం చెబుతున్నదని చెప్పారు. మూడు లక్షల ఎకరాలకు కూడా ఎప్పుడు పట్టాలిస్తారో స్పష్టం చేయాలని కోరారు. పోడు పట్టాల విషయంలో ఏ ఒక్క ఆది వాసీకి అన్యాయం జరిగినా భద్రాచలం నుంచి అంబేద్కర్ సచివాలయం వరకు పోరు యాత్ర నిర్వహిస్తామన్నారు. మోడీని గద్దెదించాలని కోరారు. తెలంగాణ కమ్యూని స్టుల పోరాటాల అడ్డా అనీ, కుంజా బుజ్జి, సున్నం రాజయ్య వంటి నేతల స్ఫూర్తితో పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చా రు. భద్రాచలం నుంచి పోలవరం ముంపు పేరుతో విడిపోయిన ఐదు గ్రామ పంచాయ తీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయా లని కేంద్రాన్ని కోరారు. బహిరంగ సభలో ఆదివాసీ కళాకారుల సకినం కోయ, వివిధ నృత్యా లు ఆకట్టుకున్నాయి. వివిధ అంశాల్లో జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన ఆదివాసీ బిడ్డలు, పోరాట తెగువ చూపిన ఆదివాసీ వనితలను బృందా కరత్ సన్మానించారు. మాజీ ఎంపీ మిడి యం బాబూరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్య క్షులు పోతినేని సుదర్శన్, టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి తొడసం భీమ్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్, ఆహ్వా న సంఘం అధ్యక్షులు పాయం రవి వర్మ, ఉపాధ్యక్షులు బండా రు రవికుమార్, మచ్చ వెంకటేశ్వర్లు, కారం పుల్లయ్య, పి.సోమయ్య, ఏజే రమేష్, అన్నవరపు కనకయ్య, సరియం కోటేశ్వర రావు, దుగ్గి కృష్ణ, సున్నం గంగ, వజ్జా సురేష్, దుబ్బకట్ల లక్ష్మయ్య పాల్గొన్నారు.