Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంను కలిసి పరిష్కారానికి కృషి చేస్తాం :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వీఓఏలు వారి న్యాయమైన సమస్య పరిష్కరించాలని చేస్తున్న సమ్మెకు సీపీఐ(ఎం) పూర్తి మద్దతు ఇస్తుందని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసి విన్నవిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇప్పటికే లేఖ రాసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఓఏల సమ్మె కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లోని చిల్ట్రన్స్ పార్కు వద్ద వీఓఏల దీక్ష శిబిరాన్ని తమ్మినేనితోపాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ఐకేపీ విఓఏలు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా, చర్చలకు ఆహ్వానించకుండా మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే వీఓఏలు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖ రాశామని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో ముఖ్యమంత్రిని కలువనున్నట్టు తెలిపారు. మీ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందని, పూర్తిగా పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందని చెప్పారు. వీఓఏలకు గౌరవ వేతనం కాదు, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాంఢ్ చేశారు. అనేక ప్రభుత్వ పథకాలైన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా 18వేల మంది వీవోఏలు గ్రామ సంఘా లకు సహాయకులుగా పనిచేస్తున్నారని తెలిపారు.
మిర్యాలగూడలో వీఓఏలు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం 19వ రోజుకు చేరుకుంది. నిరవధిక సమ్మెకు ఐద్వా నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోలబోయిన వరలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి, వేములపల్లి వైస్ ఎంపీపీ పాదురి గోవర్ధన మద్దతు తెలిపారు.