Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జమ్ముకాశ్మీర్లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే జవాన్ మృతి చెందడం పట్ల మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో యువ జవాన్ని కోల్పోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అనిల్ మృతిపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సైతం సంతాపం ప్రకటించారు.