Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డే కేర్ సెంటర్ల నిర్వహణ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. శుక్రవారం హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వికలాంగుల, సీనియర్ సిటిజన్స్ శాఖపై మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు వికలాంగుల సంక్షేమ పథకాలకు పూర్తి స్థాయి లో ఖర్చు చేస్తున్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. జిల్లాల వారీగా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. అర్హులు అయిన వికలాంగులకు విల్ చైర్లు పంపిణీ చేయటంతో పాటు.. అర్హత కలిగిన వారికి ల్యాప్ టాప్లు పంపిణి సూచించారు.. జిల్లాల వారీగా సదరం క్యాంపులు నిర్వహించాలని తెలిపారు.. ప్రాధాన్యత ప్రకారం బ్యాటరీ విల్ చైర్లు అంద చేయాలనీ,.. కొత్త మోడల్ వాహనాలు కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ కార్యదర్శి భారతి హౌలీకేరి వికలాంగుల సంక్షేమ శాఖా ఎండి శైలజ తదితరులు పాల్గొన్నారు.