Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఒక్కొక్కరికీ నెలకు డైట్ చార్జీలను గతంలో రూ.1,049.546 పైసలు చెల్లించే వాళ్లమని తెలిపారు. దాన్ని రూ.1,225కు పెంచామని పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కేజీబీవీల్లో కామన్ మెనూ అమలు చేస్తామని వివరించారు.