Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మాదిగ , ఉపకులాల చిరకాల ఆకాంక్ష వర్గీకరణ పట్ల బీఎస్పీ వైఖరి ప్రకటించాలని మాదిగ విద్యార్థి ఫెడరేషన్(ఎంఎస్ఎఫ్) జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఏడో తారీఖున హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ భరోసా సభకు మాయావతి వస్తున్నందున ఈ సభలోనే బీఎస్పీ వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ల విధానంతో ఎస్సీలలోని మెజార్టీ జనాభా కలిగినటువంటి కులాలకు అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలన్నారు. ఎస్సీల, బహుజనుల పార్టీ అని చెప్పుకునే బీఎస్పీ వర్గీకరణపై తమ స్పష్టమైన వైఖరిని చెప్పకపోవటం విడ్డూరమని తెలిపారు. ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ, ఎంఆర్పీఎస్ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ భూషపాక గణేష్ మాదిగ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.