Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పాన్ ఇండియా డ్రైవ్‌లో భాగంగా హైదరాబాద్ రైల్వే స్టేషన్లో సుమారు రూ. 67.50 లక్షలు విలువగల స్మగ్లింగ్ సిగరెట్లను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. రైలు నంబర్ 12724 తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అనుమానాస్పద స్థితిలో గమనించిన పార్శిళ్లను ఆర్పీఎఫ్,జీఆర్పీ పోలీసు బందాల తనిఖీల్లో బయటపడ్డాయి. అందులో 4,50,000 విదేశీ బ్రాండ్ ''పారిస్'' సిగరెట్లు ఉన్న కార్టూన్ బాక్స్‌లను గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి తప్పుడు పేరుతో పార్సెల్ చేసిన వ్యక్తిపై ఆర్పీఎఫ్ రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈమేరకు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ రాజారాం వెల్లడించారు.
రికార్డు స్థాయిలో విద్యుదీకరణ పూర్తి :
దక్షిణ మధ్య రైల్వే వెల్లడి
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో విద్యుదీకరణను పూర్తి చేసింది.1,017 కి.మీటర్ల పొడవున విద్యుదీకరణ పూర్తికావడంతో రైల్వే శాఖ..ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎలక్ట్రికల్ భద్రతా అంశాలను, విద్యుత్ శక్తిని ఆదా చేసేందుకు విద్యుత్ భద్రత వారోత్సవాలను పాటిస్తున్నది. భద్రతా వారోత్సవాల సందర్భంగా, డివిజనల్ స్థాయి, వివిధ ఇతర విభాగాలలో విద్యుత్ భద్రతపై సెమినార్లు నిర్వహిస్తున్నది.
విద్యుద్దీకరణ తెలంగాణ ప్రాంతంలో 286.4 కి.మీ, ఏపీలో 133.7 కి.మీ, మహారాష్ట్రలో 546 కి.మీ, కర్ణాటకలో 50.8 కి.మీటర్లు పూర్తయిందని దక్షిణ రైల్వే పేర్కొంది.ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్‌జైన్ మాట్లాడుతూ విద్యుద్దీకరణ పనులు చేయడంలో అద్భుతమైన టీమ్ వర్క్, అంకితభావంతో పని చేసిన జోన్లలోని సిబ్బంది,అధికారులకు అభినందనలు తెలిపారు.