Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో మద్యం ప్రియులకు ఊరట లభించింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 180 మిల్లిలీటర్ బాటిల్‌పై రూ.10, 375 మిల్లిలీటర్ బాటిల్‌పై రూ. 20, 750 మిల్లిలీటర్బాటిల్పై రూ.40ను ప్రభుత్వం తగ్గించింది. అయితే బీరు ధరల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. ఈ తగ్గించిన ధరలు సోమవారం నుంచి కొత్తగా కొనుగోలు చేసిన మద్యం బాటిళ్లపై వర్తిస్తాయని తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మెన్ గజ్జెల నగేష్ వెల్లడించారు.