Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
కాంట్రాక్టు లెక్చరర్లు, మహిళా, శిశు సంక్షేమ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు బ్రేక్ పడింది. క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టొచ్చునని, అయితే వాళ్లకు నియామక ఉత్తర్వులు ఇవ్వరాదని హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరణ జీవో నంబర్.16ను, మహిళా, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో.18లను కొట్టేయాలని కోరుతూ ములుగుకు చెందిన బానోతు సునీత, ఇతర నిరుద్యోగులు వేసిన పిటిషన్ను గురువారం జస్టిస్ బి.విజరుసేన్రెడ్డి, జస్టిస్ ఎ.సంతోష్రెడ్డిల డివిజన్ బెంచ్ విచారించింది. నిరుద్యోగులకు అన్యాయం జరిగే విధంగా ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్ సరసాని సత్యంరెడ్డి వాదించారు. వాదనల తర్వాత హైకోర్టు క్రమబద్దీకరణ ప్రక్రియ కొనసాగించుకోవచ్చని, అయితే ఆ ప్రక్రియ తమ తీర్పుకు లోబడి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. నియామక ఉత్తర్వులు ఇప్పుడే ఇవ్వవద్దని ఆదేశించడంతోపాటు విచారణను వాయిదా వేసింది.