Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రయివేటు లిమిటెడ్ రోజువారీ విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆ కంపెనీ వేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఏపీ సర్కార్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తనిఖీల పేరిట మార్గదర్శి రోజువారీ పనులకు అవరోధం కలిగిస్తున్నారని మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రయివేటు లిమిటెడ్, ఆ సంస్థ వైస్‌ప్రెసిడెంట్ .రాజాజీ వేసిన పిటిషన్లను జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ గురువారం విచారించారు. పైవిధంగా ఉత్తర్వులు జారీ చేసి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేశారు.