Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైకోర్టు జడ్జి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి పాట్నా హైకోర్టుకు బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం గురు వారం ఆమోదించింది. దీంతో హైకోర్టు జడ్జీల సంఖ్య సీజేతో కలిపి 30కి తగ్గింది. సుమారు 5 నెలల క్రితం ముగ్గురు హైకోర్టు న్యాయ మూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. గత నెలలో జస్టిస్ నాగార్జున్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయిన విషయం విదితమే.