Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్లు, మద్యం వ్యాపారం చేయడం ప్రాథమిక హక్కు కాబోదని హైకోర్టు స్పష్టం చేసింది. డైజోపామ్ కలిపి కల్తీ చేసినట్లు అఫీసర్లు గుర్తించాకే నిజామాబాద్ జిల్లాలో 12 కల్లు దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేశారని, ఆ నిర్ణయాన్ని అధికారులు వాపస్ తీసుకుకోవడం సరికాదని తేల్చి చెప్పింది. ఆఫీసర్లు నిర్ధారణ చేశాకే లైసెన్స్ రద్దు చేసినందున వాటిని పునరుద్ధరణకు ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది.
నిజామాబాద్‌లోని కల్లు దుకాణాల్లో పులిసిన పదార్ధాలతో కల్తీ కల్లును తయారు చేశారని 12 షాపుల లైసెన్స్‌లను ప్రభుత్వం 2022 మార్చి 14న రద్దు చేసింది. తర్వాత డిసెంబర్ 31న అధికారులు తిరిగి లైసెన్స్‌లను పునరుద్ధరణ చేశారు. ఇది చట్ట వ్యతిరేకమంటూ నిజామాబాద్‌కు చెందిన రాజాగౌడ్ ఇతరులు వేసిన పిటిషన్‌ను గతంలో సింగిల్ జడ్జి సమర్ధించారు. ఈ తీర్పును 12 షాపుల ఓనర్లు వేసిన అప్పీళ్లను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్. తుకా రాంజీ డివిజన్ బెంచ్ డిస్మిస్ చేస్తూ పైవిధంగా ఇటీవల తీర్పు చెప్పింది.