Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసానికి హెచ్‌యూజే బృందం విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే-టీడబ్ల్యూజేఎఫ్) బృందం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు ప్రభుత్వం స్థానికంగా ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తున్నదని, హైదరాబాద్ జిల్లాలోని జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు, ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అన్ని వర్గాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్లు కేటాయింపు అంశం తమ దష్టిలో ఉన్నదని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో హెచ్‌యూజే కార్యదర్శి జగదీశ్, కోశాధికారి రాజశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగవాణి, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఇ.చంద్రశేఖర్, నిరంజన్కొప్పు, హెచ్‌యూజే నాయకులు అచ్చిన ప్రశాంత్, రేణయ్య, పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.