Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన సామాజిక, ఆర్థిక, సాంస్కతిక
- సూత్రాలు అజరామరం :సీఎం కేసీఆర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సమస్త జీవరాసుల పట్ల ప్రేమ, కరుణ, అహింసతో శాంతి, సహనంతో ప్రకతితోమమేకమై జీవించాలనే మహాబోధి గౌతమ బుద్ధుని జ్జానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరమని, గౌతముని బోధనలను ఆచరించడం ద్వారా మానవ జీవితానికి పరిపూర్ణత సిద్ధిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమని పురస్కరించుకుని ప్రజలందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుద్ధుని బోధనలను, కార్యాచరణను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.2500 ఏండ్ల క్రితమే శాంతియుత సహజీవన సూత్రాలను కార్యాచరణను విశ్వమానవాళికి అందించిన బుద్ధుడు సంచరించిన నేలమీద జీవిస్తుండడం ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయమని అన్నారు. వర్ణ, లింగ, జాతి తదితర వివక్షతలకు, ద్వేషాలకు వ్యతిరేకంగా, మహౌన్నతమైన దార్శనికతతో తాత్విక జ్ఞానంతో బుద్ధ భగవానుడు నాడు బోధించి ఆచరించిన సామాజిక, ఆర్థిక, సాంస్కతిక సూత్రాలు అజరామరమైనవని వివరించారు. మానవ సమాజం కొనసాగినన్నాళ్లూ బుధ్దుని బోధనలకు ప్రాసంగికత ఉంటుందని తెలిపారు. అదే సందర్భంలో..తెలంగాణ గడ్డమీద బౌద్ధం పరిఢవిల్లడం మనందరికీ గర్వకారణమని అన్నారు. తెలంగాణ సామాజిక జీవన సంస్కతిలోని మూలాలు బౌద్ధంలో ఇమిడివున్నాయని చెప్పారు. తెలంగాణలో బౌద్ధం గొప్పగా విస్తరించిందనడానికి, కష్ణా, గోదా వరి పరీవాహక ప్రాంతాల్లో వేలఏండ్ల కింద వెలసిన బౌద్ధారామాలు నేటికీ సజీవ సాక్ష్యాలుగా నిలిచాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతి ష్టాత్మకంగా తీసుకుని నాగార్జున సాగర్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో అభివద్ధి చేసిన 'బుద్ధవనం' నేడు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నదని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వెలసిల్లిన నాటి బౌద్ధా రామాలను పునరుజ్జీవింపచేస్తూ తెలంగాణ కేంద్రంగా బుద్ధుని బోధనలను ప్రపంచానికి అందించాలనే రాష్ట్ర ప్రభుత్వం దఢ సంకల్పంతో అనుసరిస్తున్న కార్యాచరణ కొనసాగుతున్నదని కేసీఆర్ తెలిపారు. సమస్త రంగాల్లో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా పాలన కొనసాగిస్తున్నామని అన్నారు.