Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజిలెన్స్ డైరెక్టర్ జనరల్, నిజామాబాద్ సీపీ కూడా
- ముగ్గురు రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసులు
- కొత్త రిజిస్ట్రార్‌గా యాదగిరి నియామకం
- ఈసీ కీలక తీర్మానాలు
- సమావేశానికి వీసీ రవీందర్ గైర్హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తెలంగాణ విశ్వ విద్యాలయం (టీయూ)లో పరిణా మాలు రోజుకో మలుపు తిరుగు తున్నాయి. ఒకవైపు వీసీ, ఇంకోవైపు ఈసీ నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా టీయూ ఉపకులపతి (వీసీ) డి రవీందర్ అవినీతి, అక్రమాలపై ఏసీబీ విచారణ చేపట్టాలని ఆ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్ ఈసీ సమావేశాన్ని నిర్వహించారు. అందులో ఈసీ చైర్మెన్, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, సభ్యులు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కె రామకృష్ణారావు, సీనియర్ ప్రొఫెసర్ నసీం, తెలంగాణ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ సిహెచ్ ఆరతి, ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ కె ప్రవీణ్‌కుమార్, తెలంగాణ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ కె రవీందర్‌రెడ్డి, నిజామాబాద్ మహిళా కాలేజీ వి వసుంధరదేవి, రిటైర్ట్ టీచర్ పి గంగాధర్‌గౌడ్, అడ్వకేట్ ఎన్ఎల్ శాస్త్రి, ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల ప్రతినిధి ఎం మారయ్యగౌెడ్ తదితరులు పాల్గొన్నారు. టీయూ వీసీ డి రవీందర్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, అడ్వకేట్ ఎం రాజేందర్ గైర్హాజరయ్యారు. అయితే ఈసీ పలు కీలక తీర్మానాలను ఆమోదించింది. తెలంగాణ యూనివర్సిటీ యాక్ట్ 1991, సెక్షన్ 4 ఆఫ్ 18(6) ప్రకారం పది మంది సభ్యులు హాజరైనందున ఈసీలో కోరం ఉందని తెలిపింది. రిజిస్ట్రార్‌ను నియమించే అధికారం ఈసీ ఉందని ప్రకటించింది. ఎం యాదగిరిని కొత్త రిజిస్ట్రార్‌గా మళ్లీ నియమించింది. టీయూ వీసీ రవీందర్ నియమించిన ముగ్గురు రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలిపింది. నిబంధనల ప్రకారం రిజిస్ట్రార్ కాలపరిమితి ముగిసినపుడు లేదా ఆ పోస్టు ఖాళీగా ఉంటే వీసీకి నియమించే అధికారం ఉందని పేర్కొంది. ఈసీ అనుమతి లేకుండానే కె శివశంకర్, బి విద్యావర్ధిని, ఎల్ నిర్మలాదేవిని వీసీ నియమించారని వివరించింది. వారు విశ్వ విద్యా లయానికి చెందిన నిధులను దుర్వినియోగం చేశారని, అనధికారికంగా చెక్కులిచ్చారని, అక్రమంగా నియామకాలు చేపట్టారని, ఇతర పరిపాలనా పరమైన ఆదేశాలిచ్చారని విమర్శించింది. లంచం తీసుకోవడం, అనధికారి కంగా పదోన్నతులు చేపట్టడం, చట్టవిరుద్ధంగా నియామకాలు, వర్సిటీ నిధులను దుర్వినియోగం చేయడం, నిధుల వినియోగానికి సంబంధించి 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు చెందిన వాటికి ఫైనాన్స్ కమిటీ, ఈసీ అనుమతి లేదని, వాటిపై విజిలెన్స్ డైరెక్టర్ జనరల్, ఏసీబీ డైరెక్టర్ జనరల్‌తోపాటు నిజామాబాద్ పోలీసు కమిషనర్లు విచారణ చేపట్టాలని కోరింది. హైదరాబాద్‌లో ఈనెల 12న ఉదయం 11 గంటలకు తదుపరి ఈసీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.