Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్న తులు వెంటనే చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లో జాక్టో చైర్మెన్ జి సదానందంగౌడ్, సెక్రెటరీ జనరల్ ఎం రాధాకృష్ణ, నాయకులు గుండం మోహన్‌రెడ్డి, చైతన్యకుమార్, రాములు, పి చంద్రశేఖర్, ఎం పర్వత్‌రెడ్డి, నగేశ్ తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు లో కేసు విచారణ ఉన్నందున తాత్కాలిక పద్ధతిలో పదోన్నతులు కల్పించాలని కోరారు. రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ బుక్స్‌ను కూడా ఉచితంగా అందిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినంద నీయమని మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
జీవోనెంబర్ 317 ఉపాధ్యాయుల కేటాయింపులో జరిగిన పొరపాట్లు ఉపాధ్యాయుల అభ్యంతరాల న్నింటినీ వేసవి సెలవుల్లోనే పరిష్కరించాలని కోరారు. అన్ని పాఠశాలల్లో సర్వీస్ పర్సన్లు, నైట్ వాచ్మెన్లను నియమించాలని సూచించారు. అన్ని పాఠశాలలకూ డిజిటల్ బోధనకనుగుణంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని తెలిపారు.
కేజీబీవీ ఉపాధ్యాయులకు బదిలీల విషయమై జీరో సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. మోడల్ స్కూలు, అన్ని రకాల గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వేసవి సెలవుల్లోనే పూర్తి చేయటానికి షెడ్యూల్‌ను ప్రకటించాలని కోరారు.