Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే పొదెం వీరయ్య
- రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు
నవతెలంగాణ- మంగపేట
ములుగు జిల్లా మంగపేటలో శ్రీలక్ష్మీనృ సింహస్వామి, ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ అమ్మవార్ల కల్యాణం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి వచ్చిన ఆగమశాస్త్ర పండితులు, యాజ్ఞికులు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం ఆధ్వర్యంలో కల్యాణం జరిపించారు. స్వామి వారి కల్యాణానికి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య- పద్మ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మెన్ నూతులకంటి ముకుందం-స్వప్న దంపతులు, దేవాదాయ ధర్మదాయశాఖ కార్యనిర్వహణాధికారి శ్రవణం సత్యనారాయణ-హైమావతి దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందజేశారు. కల్యాణాన్ని తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి జనం పెద్దఎత్తున తరలివచ్చారు.
కల్యాణానికి వచ్చిన జనం చింతామణి సెలయేరు నీటిని తీసుకెళ్లారు. గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత నుంచి చింతామణి సెలయేటి నీరు ప్రవహిస్తుంది. బ్రహ్మౌత్సవాల సందర్భంగా ఏటూరునాగారం సీఐ మండల రాజు, ములుగు సీసీఎస్ నుంచి మరో సీఐ, మంగపేట ఎస్ఐ తాహిర్ బాబాల ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.