Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తడిసిన వడ్లను ఎప్పుడు కొంటారో చెప్పాలని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వడ్లకు మొలకలు వచ్చి రైతన్న రోదిస్తున్నారని తెలిపారు. ఒక పక్క వానలు పడుతున్నా కొనుగోలు సెంటర్లు తెరవడం లేదని పేర్కొన్నారు. మరో పక్క మిల్లర్లు కోతలు పెట్టి కాంటాలు వేస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర రైతులకు మాయమాటలు చెప్పి కండువాలు కప్పే సీఎం కేసీఆర్ కు.. రాష్ట్ర రైతుల కష్టాలు కనిపించడం లేదని ఆమె వాపోయారు. తడిసిన వడ్లు కొనడంతో పాటు ఎకరాకు రూ. 30వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.