Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రయాణీకుల సౌకర్యార్థం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారమ్ నెంబర్ పదిలో హాలిస్టిక్ హాస్పిటల్స్ సౌజన్యంతో అత్యవసర వైద్య సేవ కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సీ వెంకటేశ్వర్లు దీన్ని ప్రారంభించారు. సికింద్రాబాద్ డివిజన్ డివిజినల్ రైల్వే మేనేజర్ అభరుకుమార్ గుప్తా, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మలా రాజారామ్, అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్‌కుమార్ సింగ్ రాథోడ్, హౌలిస్టిక్ హాస్పిటల్స్ చైర్మెన్ డాక్టర్ వీఎస్ రామచంద్ర, డాక్టర్ తుషారా రామచంద్ర, లయన్ వేణుగోపాల్, 108 సర్వీసెస్ మాజీ సీఈఓ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. హౌలిస్టిక్ హాస్పిటల్స్ (లయన్స్ క్లబ్) ఈ అత్యవసర వైద్య కేంద్రాన్ని రెండేండ్లపాటు ఉచితంగా నిర్వహిస్తుందని తెలిపారు. రైలులో ప్రయాణించే ప్రయాణికులు తమ వద్ద వున్నా పిఎన్ఆర్ నంబర్‌తో అత్యవసర వైద్య సహాయం పొందవచ్చనీ, ఈ సేవలు పూర్తిగా ఉచితమనీ, అత్యవసర సేవలకు 24 గంటలు అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.