Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాయావతికి మంద కృష్ణ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సానుకూలంగా స్పందించాలంటూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ శనివారం బీఎస్పీ జాతీయ అధ్యక్షులు మాయావతికి బహిరంగ లేఖ రాశారు. సామాజిక న్యాయానికి విలువనివ్వాలని ఆమెను కోరారు. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్పీఎస్) 29 ఏండ్లుగా పోరాడుతున్నదని తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లను ప్రతి రాష్ట్రంలో ఒకటో రెండో కులాలు వారు జనాభా కంటే అదనంగా రిజర్వేషన్లు పొందుతు న్నారని తెలిపారు.
దీంతో ఎస్సీలలోని ప్రతి కులానికి రావాల్సిన వాటా దక్కటం లేదని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగం, సంక్షేమ, రాజకీయ రంగాల్లో ఎస్సీల్లోని మెజార్టీ కులాలు వెనుకబడి పోతున్నాయని తెలిపారు. ప్రతి కులానికి న్యాయం జరిగేలా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలంటూ కేంద్రంలోనూ వివిధ రాష్ట్రాల్లోనూ గతంలో నియమించిన కమిషన్లన్నీ సూచించాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అంబేద్కర్, కాన్షీరాం దృక్పథంతో పోరాడుతున్న ఎంఆర్పీఎస్కు మద్దతు ప్రకటించాలని మాయావతిని ఆయన కోరారు.
హైదరాబాద్కు చేరుకున్న మాయావతి
బీఎస్పీ జాతీయ అధ్యక్షులు మాయావతి శనివారం హైదరాబాద్కు చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ప్రవీణ్కుమార్, రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్, మంద ప్రభాకర్,చంద్రశేఖర్ ముదిరాజ్ తదితరులు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు.