Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్ఆర్జేసీ సెట్ -2023 ప్రవేశ పరీక్షకు 90.23 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ మేరకు శనివారం టీఎస్ఆర్జేసీ సెట్ -2023 కన్వీనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 మొదటి సంవత్సరంలో ప్రవేశానికి గాను 251 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. పరీక్షలు రాసేందుకు 55,232 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా 49,836 మంది విద్యార్థులు హాజరయ్యారు. టీఎస్పీఈసెట్ -2023కు ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసు కునే గడువును ఈ నెల 16 వరకు పొడిగించారు. ఈ మేరకు టీఎస్ పీఈసెట్ కన్వీనర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీ.పీఈడీ లేదా డీ.పీఈడీలో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన వారు, ఇప్పటికే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వారు, డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నవారు, డిగ్రీపూర్తి చేసుకున్న వారు ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేం దుకు అర్హులని తెలిపారు. మరోసారి గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు.