Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28.87 లక్షల మంది దరఖాస్తు
- 513 నగరాల్లో పరీక్ష నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ పరీక్ష ఆదివారం జరుగనుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 20,87,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. భారత్ లో 499 నగరాలు, ఇతర దేశాల్లో 14 నగరాలు కలిపి మొత్తం 513 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ నెల మూడో తేదీ నుంచి దరఖాస్తు చేసిన అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి సుమారు 70 వేల మంది అభ్యర్థులు నీట్‌కు దరఖాస్తు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలోని 24 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.