Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జీతాలు, ఇతర బిల్లుల చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని పున్ణ సమీక్షించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కావలి అశోక్ కుమార్, కటకం రమేష్ కోరారు. ట్రెజరీకి సమర్పించిన బిల్లులు కొన్ని నెలలుగా ఈ కుబేర్లో పెండింగ్లో పెట్టి ఏక మొత్తంగా రిజెక్ట్ చేయడం సరైందికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైద్య ఖర్చులు, కుటుంబ ఖర్చులు, పిల్లల ఉన్నత విద్యాభ్యాసం, వివాహ ఖర్చులు, గృహ నిర్మాణ సంబంధించినటువంటి అవసరాల కోసం సమర్పించిన బిల్లులను తిరస్క రించి...కొత్త టోకెన్లు తీసుకోవాలని చెప్పడం ఉపాధ్యయులను ఆవేదనకు గురి చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి బిల్లులన్నీ క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.