Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు రాష్ట్ర పౌరులను తరలించనున్న ప్రత్యేక విమానం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మణిపూర్‌లో చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో అక్కడ నివసించే రాష్ట్ర పౌరులు, విద్యార్థుల రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటు న్నదని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ముఖ్యంగా, అక్కడ నివసి స్తున్న తెలంగాణ పౌరులను తరలించడానికి ఆది వారం ఉదయమే ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేసి నట్టు డీజీపీ తెలిపారు. అక్కడ శాంతి భద్రతల పరంగా ఏదేనీ సమస్యలను ఎదుర్కొంటున్న తెలం గాణ విద్యార్థులు, ఇతర పౌరులు వెంటనే సాయం కోసం 7901643283 నెంబర్‌ను సంప్రదించాలనీ, ఈ నెంబర్ నుంచి వచ్చే కాల్స్‌కు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఐజీ బి.సుమతి స్పందించి తగిన చర్యలు తీసు కుంటారని ఆయన చెప్పారు. అలాగే ఎప్పటికప్పుడు అక్కడి చీఫ్ సెక్రెటరీతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంప్రదిస్తూ తగిన సహాయక చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.