Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మణిపూర్‌లో నెలకొన్న శాంతిభద్రతల సమస్య నేపథ్యంలో అక్కడి తెలంగాణ విద్యార్థుల్ని తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దానితో పాటు మణిపూర్‌లోని తెలంగాణ ప్రజలకు సేవలు అందించేందుకు ప్రత్యేక సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్ సహా పలు విద్యాసంస్థల్లో చదువుతున్నారు. వారికోసం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ విమానం ఆదివారం ఉదయం ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.