Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2022-23లో రూ.72,564 కోట్లు వసూలు చేయడం అభినందనీయం
- ఈ ఏడాది లక్ష్యం రూ.85,413 కోట్లు
- స్ట్రీట్ఓన్ రెవెన్యూ గ్రోత్‌రేట్‌లో మనమే టాప్ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం నుంచి సెస్ తీసుకోని ఏకైక రాష్ట్రం మనదేననీ, తెలంగాణ జీరో సెస్ టేకింగ్ స్టేట్ ఇన్ ఇండియాగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. వాణిజ్య పన్ను ల శాఖ 2022-23లో రూ.72,564 కోట్ల పన్నుల ను వసూలు చేసి చరిత్ర సృష్టించిందన్నారు. అందు కోసం కృషిచేసిన వాణిజ్య పన్నుల శాఖలోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. శని వారం హైదరాబాద్‌లో వాణిజ్య శాఖ ఆదాయ వనరు లు పెంపుదలపై నిర్వహించిన మేధోమధన సదస్సు కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్య క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, కమర్షియల్ టాక్స్ కమిషనర్ నీతూ ప్రసాద్, రాష్ట్ర కమర్షియల్ శాఖ అధికారులు, ఉద్యో గులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని ఏ రాష్ట్రంలో లేనట్టుగా ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదనీ, దానికి ధనాన్ని సమీకరించడంలో వాణిజ్య పన్నుల శాఖదే పెద్ద చేయి అని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఆశాఖకు ఇచ్చిన బడ్జెట్ లక్ష్యం రూ. 85,413 కోట్లను చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వాణిజ్యపన్నుల శాఖ పనితీరును సీఎం కేసీఆర్ అనే సదస్సుల్లో మెచ్చుకున్న విష యాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో కొనసాగుతు న్న అనేక సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అను సరిస్తున్నదని వివరించారు. ఎనిమిదేండ్లలో స్ట్రీట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ రేట్లో దేశంలోనే మన రాష్ట్రం నెంబర్‌వన్ స్థానంలో ఉందని చెప్పారు. పారదర్శక పరిపాలన అందించినప్పుడే ఇలాంటి రెవెన్యూ గ్రోత్ రేట్ సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో కమర్షియల్ ట్యాక్స్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామన్నారు. 2014లో రూ.1,12,162 ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం, 2022లో రూ.2,65,942కు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొలమానం అని చెప్పారు. దక్షిణ భారతదేశంలో వ్యవసాయ వృద్ధిరేట్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందన్నారు. వ్యవసాయం, సంక్షేమం, ఐటీ, ఇలా అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో తెలంగాణ దూసుకు పోతున్నదని చెప్పారు. సదస్సులో పాల్గొన్న 158 మంది ఆఫీసర్లు 6 టీములుగా ఏర్పడి, విభిన్న రంగా ల్లో పన్ను ఏ విధంగా ఎగవేతకు గురవుతుందో వెలికి తీసి తమ అనుభవాన్ని, ఆలోచనలన్నీ చట్టంలో ఉన్న సూక్ష్మాలని రంగరించి ఒక ప్రణాళికను తయారుచేసి ఇస్తున్నందుకు అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు.