Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.62 లక్షల 'ఉచిత ప్రమాద బీమా సౌకర్యం' పొందండి
- సింగరేణి కార్మికులకు ఆ సంస్థ డైరెక్టర్ బలరాం సలహా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణిలో పనిచేసే కార్మికులు, అధికారులందరూ తమ బ్యాంకు అకౌంట్లను 'కార్పోరేట్ శాలరీ అకౌంట్'గా మార్చుకోవాలని ఆ సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్ బలరామ్ శనివారం నాడొక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల రూ. 62 లక్షల 'ప్రమాద బీమా స్కీమ్' ప్రయోజనాలు పొందవచ్చనీ, దీనికోసం ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరంలేదని వివరించారు. సింగరేణి తమ సంస్థలోని 44 వేల మంది ఉద్యోగులకు ప్రతినెలా దాదాపు రూ.300 కోట్ల జీతాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు ఇతర బ్యాంకుల సేవింగ్స్ అక్కౌంట్స్ ద్వారా చెల్లిస్తున్నదని తెలిపారు. బ్యాంకు ఖాతాలు ఉన్న అధికారులు, కార్మికులకు మరింత లబ్ది చేకూర్చేందుకు ఉచితంగా 'ప్రమాద బీమా స్కీమ్' అమల్లోకి తెచ్చామన్నారు. ఈ స్కీమ్‌కు అర్హత సాధించాలంటే సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారంతా కార్పోరేట్ శాలరీ అకౌంట్‌గా మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు 44వేల బ్యాంక్ అకౌంట్లలో దాదాపు 30వేల మంది అకౌంట్లను బ్యాంకులు 'కార్పోరేట్ శాలరీ అకౌంట్' ఖాతాలుగా మార్చాయని వివరించారు. మిగిలిన వారు కూడా తమ ఖాతాల్ని మార్చుకోవాలని సూచించారు.