Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లోకి మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఆ రాష్ట్రానికి చెందిన మచ్చీంద్ర గుణ్వంతరావు బీఆర్ఎస్లో చేరారు. లాతూర్ జిల్లా ఉద్గిర్ నియోజకవర్గానికి చెందిన గుణ్వంతరావు 2009లో ఉద్గిర్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా లాథూర్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీచేసి 4 లక్షల ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అధ్యక్షు డు, తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా లకు ఆకర్షితులై ఆపార్టీలో చేరి నట్టు గుణ్వంతరావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆయకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. ఎన్సీపీ పార్టీకి చెందిన రాయగడ్ జిల్లా నివాసి రాహుల్ ఎస్ సాల్వి, మ హద్ తాలూకకు చెందిన సిద్ధార్థ్ హటే, రాయగడ్ థానే కొంకణ్ ప్రాంతానికి చెందిన ప్రకాశ్ కె తొంబారె, రాయగడ్కు చెందిన సామాజిక కార్యకర్త మునాఫ్ అమిర్ అధికారి, సౌత్ ముంబైకి చెందిన దేవేంద్ర సోలం కి, నార్త్ ముంబైకి చెందిన మాజీ కార్పొరేటర్ పీఎస్ నాగ్రా జన్ బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ సీఎం కేసీఆర్ ఆహ్వానం పలికారు.