Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని పాఠ్యపుస్తకాల్లో తిరిగి ప్రవేశపెట్టాలి : శాంతిస్వురుప్ భట్నాగర్ ఆవార్డు గ్రహీత డా. సిహెచ్. మోహన్ రావు
- ఘనంగా జనవిజ్ఞాన వేదిక 4 వ వార్షిక సభలు
నవతెలంగాణ- నల్లగొండ
విద్యార్థులతో పాటు ప్రజలకు కూడా సైన్స్ పట్ల అవగాహన కల్పించాలని శాంతిస్వురుప్ భట్నాగర్ ఆవార్డు గ్రహీత, సెంటర్ ఫర్ సెల్యూలర్ మాలిక్యులర్ బయాలజీ పూర్వ సంచాకాకులు డా. సిహెచ్. మోహన్రావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు మోహనరావు చెప్పారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని మనోరమ హోటల్లో జన విజ్ఞాన వేదిక(జేవీవీ) తెలంగాణ రాష్ట్ర 4వ వార్షిక మహాసభలను ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు శనివారం జేవీవీ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. సమాజంలో రెండు వాదనలు ఉంటాయని పక్కవారి వాదనలను ఖండించాల్సిన అవసరం లేదని, మీ వాదనను ప్రజలకు, సమాజానికి వివరించాలన్నారు. డార్విన్ సిద్ధాంతాన్ని విద్యార్థులకే కాకుండా ప్రజలకు కూడా వివరించాలన్నారు. సైన్స్ టీచర్లకు కూడా సైన్స్ పట్ల శిక్షణ ఇవ్వాలన్నారు. డార్విన్ సిద్ధాంతంతో పాటు ప్రముఖ శాస్త్రవేత్తలు, రచయితలు రూపొందించిన సిద్ధాంతాలను గురించి వివరించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ జేవీవీ సులభంగా అర్థమయ్యే విషయం కాదని, ప్రతి ఒక్క విద్యార్థి డార్విన్ సిద్దాంతం చదివిన వాళ్లమే అన్నారు. డార్విన్ సిద్ధాంతాన్ని పదవ తరగతి సిలబస్లో తీసేయడం సరైందికాదని తిరిగి పునరుద్దరించాలన్నారు. క్రిమినల్స్ చేతిలో దేశం బంధీ అయిందని మోడీ, అమిత్ షా దేశంలోని వనరులన్నింటిని అమ్మేశారని అన్నారు. జేవీవీ పూర్వ అధ్యక్షులు కెఎల్. కాంతారావు మాట్లాడుతూ రాజ్యం అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్రీయంగా సైన్సుకు పరిశోధనలకు ఎలాంటి ప్రోత్సహం ఇవ్వడం లేదన్నారు. తమ అనాలోచిత ప్రభుత్వ పాలసీలతో ప్రజలను మూఢత్వం వైపు మరల్చుతూ చైతన్య రహీతుల్ని చేస్తోందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి జి. మురళీధర్ రెండు తెలుగు రాష్ట్రాలలో సైన్స్ ప్రచారంలో మరింత సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. సభకు ముందుగా మూఢ నమ్మకాలను నమ్మవద్దంటూ కళాకారులు గీతాలను ఆలపించారు.
మూఢ నమ్మకాలు, అశ్లీలతకు వ్యతిరేకంగా ప్రచురించిన పలు పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేవీవీ నల్గొండ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్ర శేఖర్ రెడ్డి, అమరయ్య రాష్ట్ర కార్యదర్శి వెంకట రమణారెడ్డి, రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి విచ్చేసిన ప్రతినిధులు పాల్గొన్నారు.