Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రం నుంచి 65 వేల మంది హాజరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా సుమారు 20.5 లక్షల మంది హాజరుకాగా..మన రాష్ట్రం నుంచి 65 వేల మంది పరీక్ష రాశారు. అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో మణిపూర్లో ఈ పరీక్షను వాయిదా వేశారు. మన రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్నగర్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల, జగిత్యాల, జనగాం, కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట్ ప్రాంతాలలో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. అరగంట ముందు వరకూ విద్యార్థులను హాల్లోపలికి అనుమతించారు. ఒకటిన్నర తర్వాత వచ్చిన విద్యార్థులను పరీక్షాకేంద్రాల్లోకి అనుమతించలేదు. ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఈసారి ప్రశ్నాపత్రం మధ్యస్తంగా వచ్చిందనీ, ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని తెలిపారు. రాష్ట్రం నుంచి 40 నుంచి 45 వేల మంది అర్హత సాధించే అవకాశం ఉండగా..8 వేలకుపైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.