Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మణిపూర్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా హైదరాబాద్కు తరలిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఆదివారం రాత్రిగానీ, సోమవారం ఉదయంగానీ ఇంపాల్ నుంచి ప్రత్యేక విమానంలో వారు బయలుదేరనున్నారు. కలకత్తా మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి హర్షవర్ధన్ అనే విద్యార్థి చేరుకున్నాడు. అతడు బస చేసేందుకు తెలంగాణ భవన్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ భవన్తో పాటు హైదారాబాద్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సంప్రదించి అవసర మైన చర్యలు తీసుకుంటున్నారు. మరో వైపు విద్యా ర్థుల భద్రతపై మణిపూర్ రాష్ట్ర పోలీసులతో డీజీపీ అంజనీకుమార్ ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు.