Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బంజారాహిల్స్
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న సిటీ సెంట్రల్ మాల్లో విషాదం చోటుచేసుకుంది. మాల్లోని ప్లే జోన్లో మూడేండ్ల చిన్నారి చేయి మిషన్‌లో పెట్టడంతో ఆమె మూడు చేతి వేళ్లు తెగిపోయాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని ఇబ్రహీంనగర్‌కు చెందిన దంపతులు ముగ్గురు పిల్లలను తీసుకుని సిటీ సెంట్రల్ మాల్‌కు వచ్చారు. పిల్లలు ప్లే జోన్లో ఆడుకుంటుండగా మెహ్విష్ లుబ్నా అనే 3 ఏండ్ల చిన్నారి ఓ యంత్రంలో చేయి పెట్టడంతో విషన్లో వెళ్లు ఇరుక్కొని కుడి చేతి మూడు వేళ్లు తెగిపోయాయి. దాంతో పాపను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలిక 3 వేళ్లను వైద్యులు తొలగించినట్టు తెలిసింది. అనంతరం మాల్ నిర్వాహకులపై చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం నిర్వాహకుల నిర్లక్ష్యమేనని బాలిక తండ్రి ఆరోపించాడు. సరైన సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నాడు.