Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేశ పేరు ప్రతిష్టలను ఇనుమడింపచేస్తూ, పతకాలు సాధిస్తున్న మహిళా రెజ్లర్లపై లైంగిక వేదింపులు దారుణమనీ, దీనిపై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు న్యాయం చేయాలని పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వీ సంధ్య డిమాండ్ చేశారు. మీడియాతో పాటు పాలకులు కూడా ఈ సమస్యపై సరిగా స్పందించట్లేదని ఆమె అభిప్రాయపడ్డారు. న్యాయం కోసం పోరాడుతున్న రెజ్లర్లపై దాడులకు పాల్పడుతున్నారనీ, పోలీసులు కూడా అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ, అవమానాలకు గురిచేస్తున్నారని చెప్పారు. దీనిపై సుప్రీం కోర్టు జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.