Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసియా బెర్లిన్ సమ్మిట్‌కు హాజరుకావాలని పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరొక అంతర్జా తీయ ఆహ్వానం అందింది. జర్మనీలోని బెర్లిన్‌లో జరిగే ఏషియా బెర్లిన్ సమ్మిట్-2023కు హాజరు కావాలంటూ నిర్వాహకులు ఆహ్వానాన్ని పంపిం చారు. ఈ సమావేశం జూన్ 12 నుంచి 15 వరకు జర్మనీలోని నగరంలో కొనసాగనుంది. 'కనెక్టింగ్ స్టార్ట్అప్ ఈకో సిస్టం' అనే అంశంపై జరిగే ఈ సదస్సుకు హాజరై ప్రసంగించాలని కేటీఆర్‌ను వారు కోరారు.జర్మనీ సెనెట్‌కు చెందిన ఎకనామిక్స్, ఎనర్జీ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌ను ఆ సమ్మిట్‌కు ఆహ్వానించారు. ఈ సదస్సులో ప్రసంగించడం ద్వారా భారత్‌తో పాటు తెలంగాణ, ఇతర దేశాల మధ్య బలమైన భాగస్వామ్యా లను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ప్రయత్నాలను బలోపేతం చేయాలని ఆ సంస్థ కేటీఆర్‌ను కోరింది. ప్రతి ఏటా ఈ సదస్సు ద్వారా జర్మనీ, అసియా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను, భాగస్వామ్యాలను మెరుగుపర్చేం దుకు నిర్వహించ నున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా జర్మనీలో ఉన్న స్టార్ట్అప్లను అసియా ఖండంలోని మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. సదస్సులో మొబిలిటీ, లాజిస్టిక్స్, ఎనర్జీ, గ్రీన్‌టెక్, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రధానమైన అంశాలను విస్తతంగా చర్చించనుందని తెలిపారు. దీంతోపాటు ఈ సమా వేశంలో భాగంగా పెట్టుబడి దారులకు ప్రత్యేకమైన సెషన్ ఉంటుందని, అద్భుత మైన ఆలోచనులున్న స్టార్ట్అప్ కంపెనీలు ఈ అవకాశా న్ని వినియోగిం చుకోవచ్చని కోరారు. జర్మనీలో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం బలాన్ని అసియా ఖండంలోని స్టార్ట్అప్లతో పంచుకునేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయోగపడు తుందని నిర్వాహ కులు కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.