Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూకు మించి ఖర్చు: 'ఎక్కడ ఆర్థిక సమైఖ్యవాదం?' చర్చలో సాయిప్రసాద్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జీఎస్టీ వసూళ్లల్లో లోపాలున్నాయని, ఈ పన్ను విధానం అమలై ఐదేండ్లు కావొస్తున్నా ఆటోమేషన్ చేయడంలేదని డీజీఏ ఇండిపెండెంట్ డైరెక్టర్ సీహెచ్వీ సాయిప్రసాద్ అన్నారు. ఆదివారం ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐ ఆడిటోరియంలో ఆ సంస్థ అధ్యక్షులు శిశీర్ అధ్యక్షతన నిర్వహించిన 'ఎక్కడ ఆర్థిక సమైఖ్యవాదం?' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతదేశ సమైఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్థానిక ప్రభుత్వాలైన(స్థానిక సంస్థలకు) నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2015లకు ముందు ఫైనాన్స్ కమిషన్స్, వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా నిధులు కేటాయించిందని గుర్తుచేశారు.13వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు 32శాతం ఉన్న నిధులను 14వ ఆర్థిక సంఘం నాటికి 42శాతం పెరిగాయని వివరించారు. స్థానిక సంస్థలకు 58శాతం నిధులు కేటాయించినట్టు తెలిపారు. దేశంలో మౌలిక వసతుల కల్పనలో ప్రయివేటు సంస్థల భాగస్వామ్యం పెరగడంతో ప్రయివేటు ఆర్థిక వ్యవస్థ కూడ పెరిగిందని అన్నారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రెవెన్యూకు మించి సంక్షేమ పథకాల పేరుతో ఖర్చుచేస్తున్నాయని వివరించారు. రాష్ట్ర జీఎస్డీపీ ప్రకారం 3శాతం అప్పులు తీసుకోవాలనే నిబంధన ఉన్నా అంతకుమించి అప్పులు చేస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి తప్పడంలేదని అన్నారు.