Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేవీవీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కోయ వెంకటేశ్వరరావు, శ్రీనాథ్
నవతెలంగాణ-నల్లగొండ
రాష్ట్రవ్యాప్తంగా డార్విన్ జీవపరిణామ సిద్ధాంత ప్రచారంలో భాగంగా 1000 సదస్సులను నిర్వహించనున్నట్టు జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కోయ వెంకటేశ్వరరావు, శ్రీనాథ్ తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మనోరమ హోటల్లో రెండు రోజుల పాటు జరిగిన జేవీవీ రాష్ట్ర 4వ వార్షిక సభలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవ శాస్త్రానికి వెన్నెముకైన పరిణామ సిద్ధాంతాన్ని పదవ తరగతి పాఠ్యాంశం నుంచి తొలగించినందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అనేక పాఠశాలలు, కళాశాలల్లో రానున్న రెండు, మూడు నెలల్లో 1000 పైగా సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. సమకాలీన శాస్త్ర అంశాలను విద్యార్థులకు నిరంతరం తెలియజేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1500 పైగా పాఠశాలల్లో సైన్స్క్లబ్లను ఏర్పాటు చేస్తామన్నారు. తామ చేపట్టిన శాస్త్ర ప్రచార కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాల్సిందిగా శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, మేధావులను కోరారు. విద్యార్థులతో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నేడు పాలకులు అభివృద్ధి పేరుతో శాస్త్ర పరిశోధనల ఆవిష్కర ణలను దుర్వినియోగం చేస్తున్నారని, దాని ఫలితమే మనం ఎదుర్కొంటున్న అనేక పర్యావరణ సమస్యలని తెలిపారు.